శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (16:34 IST)

పబ్జీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చా..?

pubg game
పబ్జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్‌ను గతంలో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తేశారు. 
 
ప్రస్తుతం ఏ ఆండ్రాయిడ్ యూజర్ అయినా దీన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లే స్టోర్‌లోకి వెళ్లినా ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకోలేకపోతే.. గేమ్‌ డౌన్‌లోడ్ కోసం BGMI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ప్రస్తుతం సర్వర్ ప్రాబ్లమ్ తలెత్తుతోందని త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఇకపోతే ఈ గేమ్ కారణంగా గతంలో కొన్ని దారుణాలు కూడా జరిగాయి. పబ్‌జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించినందుకు లఖ్‌నవూలోని ఓ బాలుడు కన్నతల్లినే కాల్చి చంపాడు. ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఈ గేమ్‌పై ప్రభుత్వం బ్యాన్ విధించింది.