Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీఎస్ఎన్ఎల్ 5జీతో జియోకు షాక్? 2018 మార్చి నెలలో ముహూర్తం..?

గురువారం, 7 సెప్టెంబరు 2017 (13:38 IST)

Widgets Magazine
bsnl

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ త్వరలో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 4జీతో రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. జియోకు చెక్ పెట్టే దిశగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

జియో ఉచిత డేటా ఆఫర్‌లో టెలికాం సంస్థలన్నీ తీవ్ర నష్టాన్ని చవిచూసిన తరుణంలో.. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందించే దిశగా సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ చౌక ధరకే డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
 
బీఎస్ఎన్ఎల్  కూడా చౌక ధరలో డేటా ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. అయితే 3జీ సేవలకే పరిమితమైన బీఎస్ఎన్ఎల్.. ప్రస్తుతం 5జీ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ 5జీ సేవల కోసం నోకియాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

2018 మార్చి నెలలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రిలయన్స్ జియో షాక్‌కు గురైంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 90జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్‌‌ను రూ.429లకే అందించనుంది. రూ.8, రూ.19లకే చౌక కాల్ రేట్లతో కూడిన వౌచర్లను కూడా వినియోగదారులకు అందజేయనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

'ట్రూ కాల‌ర్‌'లో నంబర్ స్కానింగ్ ఫీచర్.. ఎలా?

అప‌రిచిత నంబ‌ర్ల వివ‌రాల‌ను వెల్లడించే 'ట్రూ కాల‌ర్' యాప్ గురించి స్మార్ట్‌ఫోన్ ...

news

సంక్రాంతికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు... కోరియంట్‌తో డీల్

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే యేడాది ఆరంభంలో 5జీ సేవలను అందించే దిశగా ...

news

లెనోవో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కె8 ప్లస్.. అదిరిపోయే ఫీచర్లు...

ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన లెనోవో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ...

news

డేటా స్పీడులోనూ జియోనే టాప్.. తర్వాతే ఎయిర్‌టెల్, ఐడియా

టెలికామ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న ...

Widgets Magazine