బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త రీఛార్జ్.. రూ.997లకు ప్రీపెయిడ్ ప్లాన్

bsnl logo
సెల్వి| Last Updated: శనివారం, 9 నవంబరు 2019 (15:42 IST)
భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో వంటి టెల్కోలకు ధీటుగా ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ కూడా కొత్త దీర్ఘకాలిక రీఛార్జిని ప్రవేశపెట్టింది. భారతీ ఎయిర్‌టెల్‌లో రూ.998లతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుండగా, వొడాఫోన్ ఐడియా, జియో రూ.999 ధర వద్ద రీఛార్జి ప్లాన్‌లను అందిస్తున్నాయి. అన్ని టెల్కోస్ నుండి ఈ ప్రీపెయిడ్ ప్రణాళికలు 90 రోజుల చెల్లుబాటును అందిస్తాయి.

బీఎస్ఎన్ఎల్ రూ.997 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ముంబై, డిల్లీతో సహా ఈ ప్రాంతానికి అయినా, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 3 జీబీ డేటా, డేటా పరిమితి తగ్గిన తరువాత వేగం 80 కెబిపిఎస్‌లకు తగ్గుతుంది.

రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, పీఆర్‌బీటీకీ రెండు నెలలకు వంటి ప్రయోజనాలు అందిస్తుంది. టెల్కో నుండి ఇతర అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే బీఎస్‌ఎన్‌ఎల్ రోజుకు కేవలం 250 నిమిషాలకు వాయిస్ కాల్‌లను పరిమితం చేస్తోంది.దీనిపై మరింత చదవండి :