Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.444లకే చౌక డేటా ఆఫర్- పోటీ పడుతున్న టెలికాం సంస్థలు

శుక్రవారం, 16 జూన్ 2017 (09:52 IST)

Widgets Magazine
bsnl logo

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లతో దూసుకెళ్తోంది. జియో దెబ్బతో పాటు ఎయిర్ టెల్ నుంచి గట్టి పోటీని తట్టుకునేందుకు వీలుగా.. బీఎస్ఎన్ఎల్ తన ప్రీ పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త డేటా ఆఫర్‌ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్‌తో రూ.444లకు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు 90 రోజుల 3జీ వేగంతో ప్రతిరోజూ 4జీబీ డేటాను అందించనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో  వెల్లడించింది. 
 
ఈ ఆఫర్ కారణంగా వినియోగదారులు రోజు వారీ డేటా ఒక జీబీ కోసం రూపాయి కంటే తక్కువ చెల్లించే సౌకర్యం లభించినట్లైంది. ఇతర సంస్థలు రోజూ 2 జీబీ మాత్రమే అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ 4 జీబీ 3జీ డేటా అందించడం విశేషం.
 
కాగా జియో ధనా ధన్ ప్లాన్ ద్వారా టెలికో సంస్థలు డేటా ఆఫర్లు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు ఇప్పటికే చౌకధరకే డేటా ఆఫర్లు ప్రకటించాయి. ఇటీవలే ఐడియా రూ.396కు 70జీబీ 3జీ డేటా ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ కూడా రంజాన్‌ను పురస్కరించుకుని 25జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను రూ.786కే అందించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

బెంగళూరులో రూ.1,100 కోట్ల పెట్టుబడి-ఇంటెల్ నుంచి 18 మాసాల్లో 3వేల ఉద్యోగాలు

బెంగళూరులో చిప్ తయారీలో పేరొందిన ఇంటెల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ...

news

హైదరాబాదులో బోర్డు తిప్పేసిన 4 ఐటీ కంపెనీలు.. యాహూ ఉద్యోగులకు చేదు వార్త

హైదరాబాద్‌కే తలమానికమైన ఐటీ కారిడార్‌లో వారం రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్టార్టప్‌ ...

news

జియో ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్ అప్రమత్తం.. ఫైబర్ కాంబో యూఎల్‌డీ 550 పేరుతో కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలో ఫైబర్ సేవలను ...

news

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... మెసేజ్‌ల ఉపసంహరణ 'రీకాల్' ఆప్షన్

సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ...

Widgets Magazine