యూకేలో ఆ రెండింటిపై నిషేధం.. ఎందుకో తెలుసా?

Last Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:10 IST)
యూకేలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం విధించేందుకు చర్యలు జరుగుతున్నాయి.  ఇటీవల యూకే పార్లమెంట్ రూపొందించిన కొత్త చట్టం ప్రకారం ఈ నిర్ణయం వెలువనున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు కారణం... ఈ రెండు సామాజిక మాధ్యమాల వల్ల ఉగ్రవాదం, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా చెలామణి అవుతుండటమే. 
ఇప్పటికే ఉగ్రవాదం, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తొలగించాలని కంపెనీ డైరక్టర్లను యూకే సర్కారు ఆదేశించింది. కంటెంట్ విచారణ, వాటిపై విధించే జరిమానాపై మొత్తం 12 వారాల గడువు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఫేక్ న్యూస్, ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై సైతం యూకే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.
 
ఇటీవల న్యూజిలాండ్‌లోని ఒక ప్రార్థనాస్థలంలో జరిగిన కాల్పుల పూర్తి నిడివి గల వీడియోను యూకేకు చెందిన 14 సంవత్సరాల మోలీ రస్సెల్ అప్‌లోడ్ చేశాడు. దీనిపై యూకే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అంతేగాకుండా.. గతంలో ఒక విద్యార్థి ఫేస్‌బుక్‌లోని వీడియోను చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించింది.దీనిపై మరింత చదవండి :