Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న ఫేస్ బుక్.. 2012 ఆ రికార్డు బద్ధలు..

బుధవారం, 28 జూన్ 2017 (11:11 IST)

Widgets Magazine
facebook, Mark Zuckerberg

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా 200 కోట్ల యూజర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రపంచాన్ని అనుసంధానం చేయడంలో తాము ఎల్లప్పుడూ ప్రగతి సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. 
 
ఫలితంగా యూజర్లు ఒకరికొకరు మరింత దగ్గరవుతున్నారని, వారితో తమ జర్నీ కొనసాగుతుందని జుకర్ బర్గ్ తన పోస్టులో రాశారు. కాగా 200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న సందర్భంగా ఫేస్‌బుక్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. తమ యూజర్ బేస్ కూడా ఏదైనా ఒక దేశం జనాభా కంటే కూడా అధికమని  జుకర్ బర్గ్ వెల్లడించింది. ఫేస్ బుక్ సాధించిన ఈ మైలురాయిలో ఇన్ స్టాగ్రామ్ లేదా వాట్సాప్ నెట్ వర్క్ యూజర్లను కలుపలేదని కంపెనీ చెప్పింది. 
 
మార్చి 31 వరకు ఫేస్ బుక్‌కు 1.94 బిలియన్ యూజర్లున్నారు. గతేడాది కంటే ఇది 17 శాతం ఎక్కువ. 2012లో అక్టోబర్‌లో తొలిసారి ఫేస్ బుక్ 100 కోట్ల మైలురాయిని చేధించింది. ప్రస్తుతం మరో కొత్త మైలురాయి 200 కోట్లను ఫేస్ బుక్ అధిగమించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జూలై 6న వివో నుంచి ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్ ఫోన్లు: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు కూడా?

బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వివో కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. వివోకు చెందిన ...

news

జియోనీ ఫోన్లలో జియో సిమ్‌లు వాడితే.. 4జీ డేటా ఫ్రీ..

మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ రిలయన్స్.. పలు ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం జియోనీ ఫోన్లలో ...

news

గూగుల్‌కు భారీ జరిమానా.. ఏకంగా 2.4 బిలియన్ యూరోల ఫైన్.. ఎందుకంటే?

గూగుల్‌కు భారీ జరిమానా పడింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ...

news

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటి...

ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న నోకియా.. ఇపుడు మళ్లీ మార్కెట్‌లోకి ఫోన్లను ...

Widgets Magazine