మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 31 మార్చి 2019 (10:49 IST)

నియర్ బై ఫ్రెండ్స్.. ఫైండ్ వైఫై పేరుతో ఫేస్‌బుక్ న్యూ ఫీచర్స్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. నియర్ బై ఫ్రెండ్స్, ఫైండ్ వైఫై పేరుతో వీటిని యూజర్లకు పరిచయం చేసింది. ఈ రెండు ఫీచర్ల ద్వారా యూజర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఫేస్ బుక్ వర్గాలు పేర్కొన్నాయి. 'నియర్ బై ఫ్రెండ్స్' అనే ఫీచర్‌ను యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లలో యాక్టివేట్ చేసుకున్నప్పుడు వారికి సమీపంలో ఉన్న ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతాయి.
 
అలాగే, ఓ యూజర్ తన ఫోనులో 'నియర్ బై ఫ్రెండ్స్' ఆప్షన్‌ను యాక్టివేట్ చేసి తాను తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తిని యాడ్ చేయాలి. అదే సమయంలో ఆ ఫ్రెండ్ కూడా తన ఫోన్‌లో ఇదే ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు, ఆ స్నేహితుడు మనకు దగ్గర్లో ఉంటే వారి వివరాలు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి.
 
ఇక, 'ఫైండ్ వైఫై' ఆప్షన్ కూడా ఇలాంటిదే. ఈ ఫీచర్‌ను క్లిక్ చేయగానే, మనకు దగ్గర్లో ఉన్న వైఫై, హాట్‌స్పాట్ డీటెయిల్స్ అన్నీ అరచేతిలో ప్రత్యక్షమవుతాయి. ఫేస్‌బుక్ యాప్‌లోని మోర్ అనే ఆప్షన్ కింద 'ఫైండ్ వైఫై' ఫీచ‌ర్‌ను పొందుపరిచారు. ఈ రెండు ఫీచర్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.