Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ వీడియో ట్యాబ్ 'వాచ్'

గురువారం, 10 ఆగస్టు 2017 (12:45 IST)

Widgets Magazine
Facebook

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన వినియోగదార్ల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇది యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపేరు వీడియో ట్యాబ్ వాచ్. 
 
తమ వీడియో ఆఫర్స్‌ను మరింత విస్తరిస్తూ టెలివిజన్‌ మార్కెట్‌లో గట్టిపోటీని ఇవ్వడానికి ఫేస్‌బుక్‌ దీన్ని లాంచ్‌ చేసింది. ప్రొఫెషనల్‌ ఉమెన్స్‌ బాస్కెట్‌బాల్‌ నుంచి సఫారీ షోల వరకు అన్ని రకాల వీడియో ప్రొగ్రామ్‌లను ఇది ఆఫర్‌ చేయనుంది. రీడిజైన్ చేసిన ఈ ప్రొడక్ట్‌ 'వాచ్‌' ప్రస్తుతం అమెరికాలోని ఫేస్‌బుక్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌, టెలివిజన్‌ యాప్లు వాడుతున్న పరిమిత గ్రూపు సభ్యులకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది. 
 
కాగా, గతేడాదే ఈ వీడియో ట్యాబ్‌ను ఫేస్‌బుక్‌ లాంచ్‌ చేసిన విషయం తెల్సిందే. మేలోనే ఫేస్‌బుక్‌ మిలినీయల్‌ ఫోకస్డ్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ క్రియేటర్స్‌ వోక్స్‌ మీడియా, బుజ్‌ఫీడ్‌, ఏటీటీఎన్‌, గ్రూప్‌ నైన్‌ మీడియా, ఇతర వాటితో ఒప్పందాలు చేసుకుంది. 
 
స్క్రిప్ట్‌, స్క్రిప్ట్‌లేని షోలను ప్రొడ్యూస్‌ చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకుంది. న్యూస్‌ ఫీడ్‌లో ప్రజలు ఎక్కువగా వీడియోలను చూసేందుకు ప్రజలు ఇష్టపడతారని తాము తెలుసుకున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ డైరెక్టరర్‌ డానియల్‌ డాంకర్‌ చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

షియోమి నుంచి ఎంఐ 5 ఎక్స్.. ధర రూ.14,200 సెప్టెంబరులో మార్కెట్లోకి..

భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ...

news

యూట్యూబ్‌‌లో కొత్త ఫీచర్.. యాప్ ద్వారా వీడియోలు పంచుకోవచ్చు

యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లోనే ఇతరులతో ...

news

స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్‌ ధరలో మరో స్మార్ట్ ఫోన్...

స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్‌లో ధరలో మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఎలైట్ వీఆర్ పేరిట ...

news

నోటిదూల : సుందర్ పిచాయ్ కన్నెర్ర .. గూగుల్ ఉద్యోగం ఊడింది..

ఓ ఉద్యోగి నోటిదూల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. గూగుల్ కంపెనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ...

Widgets Magazine