సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (13:15 IST)

ఫ్లిఫ్ కార్ట్ దూకుడు.. అమేజాన్‌కు జియో మార్ట్‌కు పోటీ ఇస్తుందా?

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ దూకుడు పెంచుతోంది. వాల్ మార్ట్‌లో మెజార్టీ వాటాను కలిగివున్న ఫ్లిఫ్ కార్ట్.. అటు అమేజాన్, ఇటు జియో మార్ట్ రూపంలో పోటీ ఇస్తుంది. జియో మార్ట్, అమేజాన్‌ల పోటీని తట్టుకోవడానికి సరికొత్త వ్యూహాలతో వస్తోంది. 
 
ఫ్లిప్ కార్ట్ క్విక్ పేరులో టుహవర్స్ డెలివరీ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, పూనె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో డజన్ల కొద్దీ చిన్నచిన్న ఫెసిలిటీ సెంటర్స్ సిద్దం చేస్తోంది. 
 
3వేల నుంచి 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే గోడౌన్స్ ఏర్పాటు చేస్తోంది. గడిచిన వారమే కంపెనీ హైపర్ లోకల్ పేరుతో సర్వీసులు ప్రారంభించింది. గ్రోసరీ, ఫ్రెష్, కొన్ని మొబైల్స్ వంటి 2వేలకు పైగా ఉత్పత్తులను ఆర్డర్ ఇచ్చిన రెండు గంటల్లో అందించేలా ఈ సర్వీసులు డిజైన్ చేశారు.
 
ప్రస్తుతం బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో సర్వీస్ చేస్తోంది. అంతేకాదు కిరాణా షాపులతో ఒప్పందం ద్వారా సొంతంగా నెట్ వర్క్ పెంచుకుంటోంది. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు… పోటీ కంపెనీలను తట్టుకునేలా ప్లాన్ చేస్తోంది.