ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జూన్ 2023 (10:13 IST)

ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చిన ఫోర్డ్ కంపెనీ

Ford
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్నట్టు తెలిపింది. అమెరికా, కెనడాలో పనిచేస్తున్న దాదాపు మూడువేల మందిని తొలగిస్తున్నట్టు తెలుస్తోంది.
 
వీరిలో రెండు వేల మంది కంపెనీ సాధారణ ఉద్యోగులు కాగా, మిగతా వారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అని సంస్థ వెల్లడించింది. 
 
భారత్ సహా పలు దేశాల్లో ఫోర్డ్ వాహనాలకు అనుకున్నంతగా డిమాండ్ లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.