Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మాయిలు కావాలంటున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:21 IST)

Widgets Magazine
Sundar Pichai

గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుందర్ పిచాయ్ అమ్మాయిలు, మహిళా శక్తిసామర్థ్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా ఉద్యోగులపై గూగుల్ ఉన్నతోద్యోగి ఒకరు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యల వల్ల ఏర్పడిన నష్టనివారణ చర్యల్లో భాగంగా సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ట్రెండింగ్ అయ్యాయి. 
 
"మీకందరికీ నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ పరిశ్రమలో మహిళాశక్తికి స్థానముంది. మాకూ అమ్మాయిలు కావాలి. గూగుల్ లో మీకూ చోటుంది" అని పిచాయ్ వ్యాఖ్యానించినట్టు 'ది వర్జ్' పత్రిక పేర్కొంది.  
 
'ప్రజల జీవనాన్ని మరింత సరళీకృతం చేసేలా కొత్త ప్రొడక్టులను కనుగొని వాటిని అందించడంపైనే గూగుల్ దృష్టిని సారిస్తుందని, మిగతా విషయాలపై ఎంత మాత్రమూ దృష్టిని పెట్టబోమని' ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, గురువారం జరగాల్సిన గూగుల్ టౌన్ హాల్ సమావేశం రద్దు అయింది. తమకు ఎదురైన అనుభవాలను చెప్పి, ప్రశ్నిస్తే, తాము టార్గెట్‌గా ఆన్‌లైన్ వేధింపులు ప్రారంభమవుతాయని కొందరు ఉద్యోగులు ఆందోళనను వ్యక్తం చేయడంతో ఈ సమావేశాన్ని గూగుల్ రద్దు చేసుకుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

వాట్సాప్‌లో ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్.. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ "ఇన్‌‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్" ఫీచర్‌ను ...

news

యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ వీడియో ట్యాబ్ 'వాచ్'

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన వినియోగదార్ల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇది ...

news

షియోమి నుంచి ఎంఐ 5 ఎక్స్.. ధర రూ.14,200 సెప్టెంబరులో మార్కెట్లోకి..

భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ...

news

యూట్యూబ్‌‌లో కొత్త ఫీచర్.. యాప్ ద్వారా వీడియోలు పంచుకోవచ్చు

యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లోనే ఇతరులతో ...

Widgets Magazine