Widgets Magazine

స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్: పూణేలో 150 గూగుల్ స్టేషన్లు

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (16:20 IST)

సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా పూణే స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ కోసం తొలిసారిగా గురువారం లార్సెన్ అండ్ టర్బోతో కలిసి పూణేలో 150 గూగుల్ హాట్ స్పాట్లను ఏర్పాటు చేసింది.

ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా లార్సెన్ అండ్ టర్బోతో చేతులు కలిపి గూగుల్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ అధికారులు తెలిపారు. ఈ గూగుల్ స్టేషన్ల ద్వారా నాణ్యమైన వై-ఫై సేవలను అందించే వీలుంటుందని వారు చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. హ్యాకర్లు ఆండ్రాయిడ్ ఫోన్లకు నూతన తరహా మాల్‌వేర్, ట్రోజన్ వైరస్‌లను వ్యాప్తి చేస్తున్నారు. ఈ వైరస్‌లు ఎక్కువగా యాప్స్ నుంచే వస్తున్నట్లు గుర్తించారు. దీంతో సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ గత ఏడాది కాలంలో ఇలాంటి వైరస్‌‍లను వ్యాప్తి చెందించే యాప్‌లను ప్లే స్టోర్ నుంచి భారీగా తొలగించింది. 
 
2017వ సంవత్సరంలో మొత్తం ఏడు లక్షల ప్రమాదకరమైన యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ తాజాగా వెల్లడించింది. అయితే 2016లో ప్లే స్టోర్ నుంచి తొలగింపబడిన యాప్స్‌తో పోలిస్తే 2017లో ఈ యాప్స్ సంఖ్య 70 శాతం ఎక్కువగా ఉందని ఐటీ నిపుణులు అంటున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

రిలయన్స్ జియో నుంచి చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ...

news

ఫిబ్రవరి 1 నుంచి మోటోరోలా మోటో ఎక్స్ 4 రిలీజ్

మోటోరోలా సంస్థ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ''మోటో ఎక్స్ 4'' విడుదల కానుంది. ఈ ...

news

గూగుల్‌లో ఇక సెర్చ్ చేస్తున్నారా? ఆ ఫీచర్ వచ్చేస్తోంది..

గూగుల్‌లో ఇక సెర్చ్ చేస్తున్నారా? వెబ్‌సైట్లు ఓపెన్ చేసినప్పుడు రిమైండర్స్ యాడ్స్ ...

news

రూ.4వేలకే బిగ్‌బజార్‌లో జియోమి 5ఏ- ఆఫ్‌లైన్‌లోనే..?

జియోమి నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5ఏ మొబైల్ ఫోన్ ఆఫ్‌లైన్‌ మార్కెట్లో ఆఫర్ ...

Widgets Magazine