శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (17:10 IST)

కరోనా ఎఫెక్ట్: గూగుల్ పే నుంచి ''నియర్ బై స్పాట్'' ఎందుకంటే?

Google pay
గూగుల్ తన వినియోగదారులకు మనీ ట్రాన్స్‌ఫర్ కోసం గూగుల్ పేను కొన్నేళ్ల క్రితం విడుదల చేసింది. ఈ గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ సులభతరమైంది. ఈ యాప్ సురక్షితం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు. గూగుల్ పేకి డబ్బు బదిలీ, బంగారం కొనుగోళ్లతో సహా వివిధ సౌకర్యాలు లభించటం గమనార్హం. 
 
ప్రస్తుతం కరోనా ఎఫెక్టుతో ప్రస్తుతం ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ పే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ''నియర్ బై స్పాట్'' ద్వారా తమ ప్రాంతానికి సమీపంలో అవసరమైన నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాల సమాచారం.. ఇంకా దుకాణాల నుంచి ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని గూగుల్ పే బెంగళూరులో ప్రవేశపెట్టింది. త్వరలో చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణేల్లో ప్రారంభించనున్నారు.