శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 5 మార్చి 2019 (22:17 IST)

హువావే వై6 వచ్చేసింది...

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ఒక్కొక్క మొబైల్ తయారీదారు సంస్థ నుండి రకరకాల మోడల్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలో హువావే సంస్థ నుండి మరో సరికొత్త ఫోన్ రానుంది. అదే వై6 2019.

హువావే సంస్థ దీనిని రష్యా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో డ్యూ డ్రాప్ నాచ్‌డిస్‌ప్లే, మీడియా టెక్ హీలియో ఏ22 సాక్ ప్రాసెసర్ అమర్చబడి ఉంది. దీని ధర రూ. 9,770గా నిర్ణయించింది.
 
హువావే వై6 2019 ప్రత్యేకతలు:
6.09 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఆండ్రాయిడ్ 9.0,
మీడియా టెక్‌ హీలియో ఏ22 సాక్‌ ప్రాసెసర్‌,
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్,
512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ మెమోరీ,
13  ఎంపీ బ్యాక్ కెమెరా,
8 ఎంపీ సెల్ఫీ కెమెరా,
3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ.