ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (20:07 IST)

భారత సైన్యం కోసం వాట్సాప్ తరహా యాప్

భారత సైన్యం జవాన్ల కోసం అత్యంత సురక్షితమైన మెసేజింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇది వాట్సాప్ తరహా యాప్. దీన్ని భారత సైన్యంలోని కమ్యూనికేషన్స్ మరియు సిగ్నల్స్ విభాగం అధికారులు రూపొందించారు.

దీని పేరు అసిగ్మా. ఇప్పటివరకు సైన్యంలో అంతర్గతంగా సందేశాలు పంపుకునేందుకు కోసం అవాన్ యాప్‌ను గత 15 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.
 
అయితే అసిగ్మా యాప్ భద్రతాపరంగా అత్యంతర సురక్షితమైనదని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవాన్‌ను అసిగ్మాతో భర్తీ చేయనున్నారు. ఈ వెబ్ బేస్డ్ యాప్ కేవలం ఆర్మీకి మాత్రమే పరిమితం. ఇతర యాప్ స్టోర్లలో దీన్ని విడుదల చేయడంలేదు.