భారత్-జపాన్‌ల మధ్య కీలక ఒప్పందం.. 5జీ టెక్నాలజీపై డీల్..?

5G technology
సెల్వి| Last Updated: బుధవారం, 7 అక్టోబరు 2020 (19:50 IST)
technology
భారత్-జపాన్‌ల మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. 5జీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లలో సహకారానికి సంబంధించి ఈ ఒప్పందం కీలకం కానుంది. చైనా టెలీకమ్యూనికేషన్​ దిగ్గజం హువావే 5జీ సేవలపై ప్రపంచవ్యాప్తంగా విముఖత కనిపిస్తున్న నేపథ్యంలో భారత్-జపాన్​ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.

డిజిటల్ సాంకేతికత ప్రాముఖ్యాన్ని గుర్తించి భారత్, జపాన్ విదేశాంగ మంత్రులు.. సైబర్ సెక్యూరిటీ ఒప్పందాన్ని అంగీకరించారు. చైనా టెలీకమ్యూనికేషన్​ దిగ్గజం హువావే 5జీ సేవలపై ప్రపంచ వ్యాప్తంగా విముఖత కనిపిస్తున్న నేపథ్యంలో భారత్-జపాన్​ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంక్లిష్ట సమాచార వ్యవస్థ, 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాల్లో సామర్థ్యం పెంపు, పరిశోధన, అభివృద్ధి, భద్రత వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారం ఈ ఒప్పందంతో మరింత పెరుగుతుందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయని విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ సమావేశంలో భాగంగా సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ రంగం, మౌలిక వసతులు, కనెక్టివిటీ, ఐరాసలో సంస్కరణలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.దీనిపై మరింత చదవండి :