శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (10:54 IST)

కరోనా ఎఫెక్ట్.. ఐటీ రిటర్న్స్ దాఖలు.. జూలై 31వ తేదీ వరకు పొడిగింపు

IT Returns
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఉపశమనం ఇచ్చింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలును జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలుకు నవంబర్ 30వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
పాన్ కార్డు - ఆధార్ కార్డు అనుసంధానం గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. 31 జూలై 2020, 31 అక్టోబర్ 2020 లోపు దాఖలు చేయాల్సిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు మరింత వెసులుబాటు (నవంబర్ 30) లభించింది. 
 
అలాగే పన్ను ఆడిట్ రిపోర్ట్ నివేదిక గడువు 31 అక్టోబర్ 2020కి పొడిగించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్/టీసీఎస్ సర్టిఫికెట్స్ జారీని వరుసగా జూలై 31, 2020, ఆగస్ట్ 15, 2020కి పొడిగించారు.