సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (22:09 IST)

జియో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్, జియో బ్రాండ్ ల్యాప్ ట్యాప్ మోడల్స్‌

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ సంస్థ తాజాగా 5జీ స్మార్ట్‌ఫోన్ మరియు జియో బ్రాండ్ ల్యాప్ ట్యాప్ మోడల్స్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించింది. రిలయన్స్ ఇండియా నుంచి తొలి 5జీ స్మార్ట్ ఫోన్ జియో బుక్ పేరిట.. చౌక ధరకే లభించనుంది. అంతేగాకుండా ల్యాప్ ట్యాప్‌తో సహా పలు ఉత్పత్తులను ఇండస్ట్రీస్ ఆన్‌డుప్‌ సమావేశంలో పరిచయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
గత ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ కోసం జియో గూగుల్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం స్మార్ట్‌ఫోన్లు, ఆండ్రాయిడ్ లేదా ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే జియో ఓఎస్‌ను స్మార్ట్‌ఫోన్‌లు కలిగి ఉంటాయని తెలిసింది. 
 
ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫాం ఎంట్రీ లెవల్ హార్డ్‌వేర్‌తో స్మార్ట్‌ఫోన్‌లలో సజావుగా నడిచేలా రూపొందించబడింది. అలాగే 5 జీ స్మార్ట్‌ఫోన్‌తో జియో ల్యాప్‌టాప్ మోడల్‌ను ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇక ల్యాప్‌టాప్‌లో హెచ్‌ఎస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, గరిష్టంగా 3 జీబీ ర్యామ్, 4 మెమరీ ఉన్న 4 జీ మోడెమ్ ఉన్నాయి.