Widgets Magazine

రూ.99కే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌‌బ్యాండ్ కనెక్షన్...

బుధవారం, 6 జూన్ 2018 (14:15 IST)

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశీయ టెలికాం రంగంలో ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటిస్తోంది. ఇందులోభాగంగా, తాజాగా రూ.99కే సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద ప్రతి రోజూ 1.5జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. 30 రోజుల పాటు ప్రతి రోజూ 20ఎంబీపీఎస్ వేగంతో కూడిన 1.5జీబీ డేటా చొప్పున, నెలలో మొత్తం 45జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. ఏదైనా ఒక రోజు 1.5జీబీ డేటా క్రాస్ అయితే అప్పుడు వేగం 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది.
bsnl logo
 
అలాగే, మరో నూతన ప్లాన్ రూ.199. ఈ ప్లాన్ కింద బీఎస్ఎన్ఎల్ 150జీబీ ఉచిత డేటాను ఇస్తుంది. అంటే ప్రతి రోజూ 20ఎంబీపీఎస్ వేగంతో కూడిన 5జీబీ డేటా ఉచితం. ఇంకో ప్లాన్‌ ధర రూ.299. ఇందులో 300జీబీ డేటా, రూ.399 ప్లాన్‌లో 600జీబీ డేటాను 20ఎంబీపీఎస్ వేగంతో అందుకోవచ్చు. ఈ నాలుగు ప్లాన్లలోనూ రోజువారీ అధిక వేగంతో కూడిన డేటా పరిమితి దాటిన వెంటనే వేగం 1ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. 
 
కాకపోతే, ఈ నాలుగు ప్లాన్లూ కొత్తగా చేరే కస్టమర్లకు మాత్రమే. ఈ టారిఫ్‌లను ఆరు నెలల పాటే వినియోగించుకోగలరు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. అపరిమిత వాయిస్ కాల్స్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ ...

news

ప్రీపెయిడ్ కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్.. హాలిడే హంగామా పేరుతో...

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో... తాజాగా తన ...

news

ఐఫోన్ ఎక్స్ ఫీచర్స్‌తో ఎంఐ 8.. త్వరలో భారత్‌లోకి...

చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ తన తాజా మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ...

news

మార్కెట్‌లోకి పతంజలి సిమ్ కార్డులు.. ఆరోగ్య బీమా కూడా...

పతంజలి సంస్థ ద్వారా వివిధ రకాల ఉత్పత్తులతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన యోగా గురువు బాబా ...

Widgets Magazine