గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (09:14 IST)

రిలయన్స్ అదుర్స్.. Vivo Y1s 4G స్మార్ట్ ఫోన్ ధర రూ. రూ. 7999

vivo y1s
2020 సంవత్సరం ముగుస్తుండగా రిలయన్స్ జియో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. తాజాగా భారీ ఆఫర్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. జియో వీవో జతగా ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌లో భాగంగా భారత్‌లో చౌక ధరకే వీవో స్మార్ట్ ఫోన్ అందించేందుకు సిద్ధమైంది. ఇంకా దానిపై జియో ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్ ఆఫర్లను ప్రకటించింది. 
 
కాగా గత కొంతకాలం జియో, వీవో జతగా 4జీ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయవచ్చునని వార్తలొచ్చాయి. ఈ వార్తలొచ్చిన కొద్దిరోజుల్లోనే జియో వీవో ఎక్స్ క్లూజివ్ Vivo Y1s 4G స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 7999 రూపాయల ధరతో మరియు రూ.4550ల భారీ బెనిఫిట్స్‌తో తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 10తో ఈ ఫోన్ పనిచేస్తుంది. మైక్రో ఎస్డీ, ట్రాన్స్ ఫ్లాష్, ఎంపీ3, పాలీఫోనిక్‌లను కలిగివుంటుంది. అలాగే మిడ్ నైట్ బ్లాక్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో వుంటుంది.