ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (13:19 IST)

జియో యూజర్లకు గుడ్ న్యూస్- భాగ్యనగరంలో 5జీ సేవలు

5gspectrum
జియో యూజర్లకు గుడ్ న్యూస్. భాగ్యనగరంలో రిలయన్స్ 5జీ సేవలు మొదలయ్యాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో కూడా ఈ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. 
 
దేశ వ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, వారణాసి, చెన్నై, కోల్ కతా, ఢిల్లీ నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లైంది. జియో ట్రూ 5జీ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా.. ప్రస్తుత వినియోగదారులు ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందవచ్చునని పేర్కొంది. 
 
జియో యూజర్లకు ఎస్ఎంఎస్ లేదా మైజియా యాప్‌లో నోటిఫికేషన్ రూపంలో ఇన్విటేషన్ వస్తుంది. అప్పుడే 5జీ నెట్‌వర్క్‌కు అనుసంధానం కాగలరు. నోటిఫికేషన్ అందిన తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లాలి. 
 
మొబైల్ నెట్‌నర్క్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత జియో సిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్‌ను ట్యాప్ చేయాలి. 3జీ, 4జీ, 5జీ కనిపిస్తాయి. 5జీ నెట్ వర్క్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో 5జీ నెట్‌వర్క్‌కు ఫోన్ కనెక్ట్ అయిపోతుంది.