శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (16:43 IST)

రిలయన్స్‌ జియో నుంచి ఐదు ప్రీపెయిడ్ ప్లాన్స్.. ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు పండగే

రిలయన్స్‌ జియో ఐదు ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రకటించింది. ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కాకముందే.. జియో ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లతో అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, వినియోగదారులకు ఏడాదిపాటు డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. వీఐపీ, ప్రీమియం ప్లాన్‌ల సబ్‌స్క్రైబర్లు ఐపీఎల్‌ 2020 క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చని డిస్నీ + హాట్‌స్టార్ ప్రకటించింది
 
ఇందులో భాగంగా రూ.401 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో 3జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, ఏడాదిపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను లభిస్తుంది. ఈ ప్లాన్‌ గడువు 28 రోజులు. 56 రోజుల వ్యాలిడిటీతో రూ.598 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ఒక సంవత్సరం డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ చందాను అందిస్తుంది.
 
రూ.777 రీఛార్జ్‌తో 1.5 జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాల్స్‌, వన్‌ ఇయర్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుండగా ప్లాన్‌ గడువు 84 రోజులు. ఆఖరిదైన రూ. 2,599 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో 2జీబీ రోజువారీ డేటా, 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.
 
వీటికి అదనంగా జియో రూ.499 విలువైన యాడ్‌-ఆన్‌ డేటా ప్లాన్‌ను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్‌ రోజుకు 1.5జీబీ డేటా,డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. ఇది 56 రోజుల పాటు వర్తించనుంది.