గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (14:10 IST)

జియో "వాలెంటైన్ ఆఫర్" : రీఛార్జ్ ప్యాక్‌లపై ఉచిత డేటాతో ప్రత్యేక ఆఫర్లు

jio
jio
వాలెంటైన్స్ డే సందర్భంగా మంగళవారం జియో కొన్ని రీఛార్జ్ ప్యాక్‌లపై ఉచిత డేటాతో సహా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈరోజు వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని.. వినియోగదారులకు జియో "వాలెంటైన్ ఆఫర్"ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, జియో నిర్దిష్ట ప్లాన్‌లకు మాత్రమే 12 జీబీ ఉచిత డేటా, కొన్ని ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. 
 
జియోకు చెందిన రూ. 349, రూ. 899, రూ. 2999 ప్లాన్‌ల రీఛార్జర్‌లకు ఈ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రకారం, పైన పేర్కొన్న ప్యాక్‌ల సాధారణ డేటాతో పాటు 12 జీబీ 4జీ డేటా ఉచితంగా అందించబడుతుంది.
 
అలాగే, ఇక్సిగో యాప్‌లో రూ. 45000.. అంతకంటే ఎక్కువ విమాన టిక్కెట్ బుకింగ్‌లపై రూ.750 తగ్గింపు ఇవ్వబడుతుంది. రూ.799 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఫెర్న్‌లు, పెటల్స్‌పై రూ.150 తగ్గింపు అందించబడుతుంది. 
 
మెక్‌డొనాల్డ్స్‌లో రూ.199 కంటే ఎక్కువ ఖర్చు చేసే వారికి రూ.105 విలువైన బర్గర్ ఉచితంగా లభిస్తుందని ప్రకటించింది. ఈ ఆఫర్‌లు రిడీమ్ చేయబడిన సమయం నుండి నిర్దిష్ట కాలానికి చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత గడువు ముగుస్తుంది.