Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియోకు పోటీగా ఐడియా 4జీ ఫీచర్ ఫోన్.. ఫ్రీగా మాత్రం కాదు...

సోమవారం, 31 జులై 2017 (11:58 IST)

Widgets Magazine
idea 4g phone

రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్ ఫోనును అందజేయనున్నట్టు ప్రటించింది. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించుకోనున్నట్టు తెలిపింది. దీంతో ఇతర మొబైల్ ఆపరేటర్లు కూడా ఇదే తరహా ఆఫర్‌కు తమ వినియోగదారులనే కాకుండా, కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ముందుకు వస్తున్నారు. 
 
ఈ కోవలో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఇప్పటికే ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1000కే 4జీ ఫీచర్‌ పోనును ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇపుడు మరో మొబైల్ కంపెనీ ఐడియా కూడా రూ.2500కే 4జీ ఫీచర్ ఫోనును అందజేయనున్నట్టు ప్రకటించింది. 
 
ఐడియా సెల్యులార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఐడియా నుంచి త్వరలో ఓ నూతన 4జీ ఫోన్ వస్తుందని తెలిపారు. అయితే ఈ ఫోన్ ధర జియో కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుందని అన్నారు. రూ.2500కు 4జీ ఫోన్‌ను అందిస్తామని చెప్పారు. 
 
జియో ఫోన్‌లో వాట్సాప్ లాంటి యాప్స్ రావని, అందులో కేవలం జియో సిమ్ మాత్రమే పనిచేస్తుందని విమర్శించారు. కానీ తాము తీసుకురాబోయే ఫోన్‌లో యూజర్లకు అవసరమైన వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి అన్ని యాప్స్ పనిచేస్తాయన్నారు. అయితే అందులో మరి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తారా..? లేదా..? అన్న వివరాలను వెల్లడించలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Idea Jio Airtel Jio Phone 4g Phone

Loading comments ...

ఐటీ

news

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.వెయ్యికే 4జి ఫోన్?... జియోకు షాక్...

టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ...

news

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ 4జీ వోల్టే సర్వీసులు...

దేశీయ టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ ...

news

జియోకి ఆ పేరు ఎలా వచ్చిందో మీరెప్పుడైనా ఆలోచించారా...

ప్రస్తుతం దేశంలో ఎవరి నోట విన్నా జియో మాటే. ఉచిత వాయిస్ కాల్‌లు మరియు అపరిమిత డేటా ...

news

జియో'వరాలతో' డిటిహెచ్ రంగం కూలిపోతుందా?

1500 రూపాయల ఫోన్. నెలకు 309 రూపాయల రీఛార్జ్ చేస్తే దేశవ్యాప్త వాయిస్ కాల్స్, ...

Widgets Magazine