Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లైకులు ఇవ్వండి.. లోన్ తీసుకోండి.. సలామ్ లోన్స్ గురించి మీకు తెలుసా?

సోమవారం, 5 జూన్ 2017 (14:32 IST)

Widgets Magazine

సోషల్ మీడియా పుణ్యంతో లైక్ అనే పదానికి అర్థం అందరికీ తెలిసిపోయింది. లైక్ అనే పదం ఫేస్ బుక్, ట్విట్టర్ ఉపయోగించే వారికి బాగా తెలుసు. లైక్ అనే మాట మన అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడుతుందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. మనకు బాగా లైక్స్ వస్తే.. లోన్ ఇచ్చేందుకు టాటా క్యాపిటల్‌ అందుబాటులోకి వస్తోంది. ఎవరైనా తమ పోస్టు ద్వారా తమకు ఆర్థిక అవసరం గురించి తెలియజేస్తూ చేసిన పోస్టుకు.. నెటిజన్లను లైకులు ఇవ్వాలి. అలా వచ్చిన లైకులను బట్టి అప్పు తీసుకోవచ్చు. 
 
ఇలాంటి వినూత్న ఆలోచనతోనే టాటా క్యాపిటల్‌ సలామ్‌ లోన్స్‌ పేరుతో రుణాలను మంజూరు చేస్తోంది. రకరకాల కారణాలతో వ్యక్తిగత రుణాలు దొరకని వారికి ఈ విధానం ద్వారా లోన్ పొందవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు, తక్కువ ఆదాయం ఉన్నవారు, వార్షికాదాయం రూ.3లక్షలకు మించని వారు ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
రుణం కావాలనుకునే వారు తమకెందుకు అప్పు అవసరం ఉందో తెలియజేస్తూ ఒక చిన్న వివరణను సమర్పించాలి. ఆపై పోస్టుని టాటా క్యాపిటల్‌ ఫేస్‌బుక్‌ పేజీ, ట్విట్టర్‌, యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేస్తారు. వీటిలో వచ్చే లైకులను.. సలామ్‌ల ఆధారంగా టాటా క్యాపిటల్ రుణాన్ని మంజూరు చేస్తుంది. ఈ రుణం రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకూ రుణం ఇస్తారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Likes Facebook Twitter Youtube Empower Dreams Salaam Loans

Loading comments ...

ఐటీ

news

ఆన్‌లైన్ మోసాలకు బ్రేక్-టీనేజర్ల కోసం ఫేస్‌బుక్ నుంచి ''టాక్'' అనే సరికొత్త యాప్

ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్న యువత కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త యాప్‌ను ...

news

సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలే కాదు.. వ్యక్తిగత వివరాల పోస్టులొద్దు.. కాస్పర్‌స్కై

ఓ వైపు స్మార్ట్ ఫోన్లు.. మరోవైపు సోషల్ మీడియా.. ఇంకోవైపు ఉచిత డేటా.. ఈ మూడు అరచేతిలో ...

news

జియో రాకతో.. పోర్న్‌సైట్స్, అడల్డ్ కంటెంటే ఎక్కువ చూస్తున్నారట..

రిలయన్స్ జియో అరంగేట్రంతో టెలికాం రంగం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. జియో రాకతో డేటా ...

news

టెలినార్-ఎయిర్ టెల్ విలీనం.. జియోను దెబ్బతీసేందుకేనా?

టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ చేసిన ప్రతిపాదనకు సెబీ ...

Widgets Magazine