మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (04:31 IST)

ఐటీ జాబ్‌ పోయిందా.. భీతిల్లవద్దు.. మీకోసం స్కాలర్‌షిప్‌తో ట్రయినింగ్ రెడీ

గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని దేశీయ ఐటీ రంగం ఎదుర్కొంటోంది. రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా వర్దిల్లుతూ వచ్చిన భారతీయ ఐటీరంగం డొనాల్డ్ ట్రంప్ అనే ఒక ఐదక్షరాల ప్రబుద్ధ ఉన్మాది కారణంగా ఇప్పుడు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక

గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని దేశీయ ఐటీ రంగం ఎదుర్కొంటోంది. రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా వర్దిల్లుతూ వచ్చిన భారతీయ ఐటీరంగం డొనాల్డ్ ట్రంప్ అనే ఒక ఐదక్షరాల ప్రబుద్ధ ఉన్మాది కారణంగా  ఇప్పుడు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకటి పలు రంగాల్లో భారతీయ ఐటీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇండస్ట్రీ పలుసార్లు నిరంతరాయంగా ఉద్యోగాల కోత ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, వివిధ సంస్థలచే భారీగా ఉద్యోగాల తొలగింపు నివేదికలు  వస్తూనే ఉన్నాయి. కొన్ని లక్షలమంది యువ ఉద్యోగులు తమ భవిష్యత్తు ఏమిటన్న డైలమ్మాతో తీవ్ర నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. ఇప్పటికే మన నగరాల్లో వేలమంది ఐటీ ఉద్యోగులకు పిక్ కవర్లిచ్చి ఇంటికి పంపేసారు. ఐటీ రంగంలో ఇక భవిష్యత్తు లేదన్న గుండె చెదిరిన వారు ఆత్మహత్యల మార్గం పడుతున్నారు.
 
ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ భయపడాల్సిన పనిలేదని, ఈ పరిణామం అంతా మంచికేనని ఒక ఆన్ లైన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపెనీ ఏటీ ఉద్యోగులకు అభయమిస్తోంది.  బెంగళూరుకు చెందిన సింప్లీలెర్న్‌ అనే  ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌  కంపెనీ ఇలాంటి వారికి ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఇటీవలి కాలంలో ఉద్యోగాలను కోల్పోయిన ఐటి  ఉద్యోగులకు సహాయపడటానికి  బౌన్స్ బ్యాక్ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.  బాధిత ఐటీ నిపుణులకు సంబంధిత కోర్సులు ,  శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా  అందించనుంది.   తద్వారా తమని తాము రీ స్కిల్‌  చేసుకునేందుకు  సహాయం చేస్తుంది.
 
ఉద్యోగం కోల్పోయిన టెకీలకు నిజంగా ఇది శుభవార్తే  భారతీయ పౌరులకు మాత్రమే లభించే ఈ స్కాలర్‌ షిప్‌‌లో ఆధునిక టెక్నాలజీలలో ఉచిత శిక్షణ ఇచ్చి, భవిష్యత్ ఉద్యోగాలు కోసం సిద్ధం చేస్తాయి. ముఖ్యంగా  క్లౌడ్ కంప్యూటింగ్, పెద్ద డేటా మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి కోరిన డొమైన్స్‌లో అత్యుత్తమ కోర్సుల్లో ట్రైనింగ్‌  ఉచితం అయితే దీనికోసం  దరఖాస్తు చేసుకునే  నాటి 60 రోజుల లోపు ఉద్యోగాన్ని కోల్పోయిన వారై అయి వుండాలి.   అలాగే ఒక​ అభ్యర్థి ఒక్క కోర్సును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. 
 
బౌన్స్ బ్యాక్ స్కాలర్షిప్ పరిధిలో రూ. 8,999 నుండి రూ. 20వేల  విలువైన కోర్సులను ఉచితంగా అందించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 31 కి ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఆటోమేషన్‌,  ఆధునిక టెక్నాలజీ తదితర అంశాల కారణంగా సంస్థల  వ్యాపారం, ఉద్యోగాల ఎంపిక  వ్యూహాలను అనివార్యంగా మార్చుకోవాల్సి వస్తోందని , ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో  ఉన్న  అర్హులైన అభ్యర్థులను ఆదు కోవడమే తమ లక్ష్యమని సింప్లీలెర్న్‌ సీఈవో కృష‍్ణకుమార్‌ చెప్పారు.