శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (17:21 IST)

ఎంఐ 10 సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌..

Mi 10S
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ ఎంఐ 10 సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. షియోమీ ఎంఐ టెన్ ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. 108ఎంపీ క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేకత.
 
8GB+128GB వేరియంట్‌ Mi 10 ఫోన్‌ ప్రారంభ ధర సుమారు 36,900గా నిర్ణయించారు. అలాగే 8GB + 256GB, 12GB + 256GB మోడళ్ల ధరలు వరుసగా రూ.39,200, రూ.42,500గా ఉండనున్నాయి. 
 
ఈ ఫోన్‌ బ్లూ, బ్లాక్‌, వైట్‌ కలర్లలో అందుబాటులో ఉంది. ఎంఐ 10ఎస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఎంఐయూఐ 12పై నడుస్తుంది. భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మి 10 ఎస్ నలుపు, నీలం, తెలుపు రంగులలో లభిస్తుంది. ఈ శుక్రవారం, మార్చి 12 నుండి ప్రారంభమవుతాయి.