1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (19:17 IST)

సెల్ఫీలు క్రేజ్ తగ్గిపోతుందా..? 4, 6 సెల్ఫీలకే పరిమితమవుతున్న..?

ఫేస్ బుక్, సెల్ఫీల గురించి నేటి తరానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అబ్బాయిలు, అమ్మాయిల ఫేస్ బుక్ సెల్ఫీలపై లండన్‌లో ఓ ఆసక్తికర సర్వే జరిగింది. ఈ సర్వేలో తేలిన వివరాలు ఏంటంటే.. అమ్మాయిలు తాము తీసుకున్న తొలి ఐదు సెల్ఫీలనూ డిలీట్ చేసి ఆరో సెల్ఫీని పోస్ట్ చేస్తున్నారట. అదే అబ్బాయిల విషయంలో అయితే, నాలుగో సెల్ఫీకే తృప్తిపడిపోతున్నారు. 
 
ఆన్లైన్ మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీ వన్ పోల్ ఈ సర్వే నిర్వహించింది. సెల్ఫీలను ఎంచుకునేముందు 64 శాతం మంది యువతులు భావోద్వేగాలకు లోనవుతున్నారట. సామాజిక మాధ్యమాల్లో తమ తమ సెల్ఫీలు చూసుకున్న తరువాత మహిళల్లో 41 శాతం మంది, పురుషుల్లో 26 శాతం మంది ఆ ఫొటోలు బాగాలేవని భావిస్తుంటారట. చిన్న పిల్లల్లో మాత్రం 79 శాతం మంది అవి బ్రహ్మాండంగా ఉన్నాయని సంబరపడుతుంటారని సర్వే వివరాలు వెల్లడించాయి. 
 
ఇక తమ పిల్లల చిత్రాలను పోస్ట్ చేసే ముందు వాటిని ఏదో రకంగా ఎడిట్ చేస్తున్నట్టు తెలిపిన వారి సంఖ్యా అధికంగానే ఉందని ఆ సర్వే తేల్చింది. 8 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 2వేల మంది మహిళలు, 2 వేల మంది పురుషులు, వెయ్యిమంది పిల్లలపై ఈ సర్వే జరిగిందని లండన్ ఆన్ లైన్ సంస్థ వెల్లడించింది. దీంతో సెల్ఫీలకు కూడా రానున్న కాలంలో క్రేజ్ తగ్గిపోతుందని సమాచారం.