ఇకపై జియో గిగా ఫైబర్‌ సేవలు.. ముకేశ్ అంబానీ

గురువారం, 5 జులై 2018 (12:02 IST)

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌తో ఇంట్లో ఉన్న కంట్రోల్ స్విచ్‌లను ఆపరేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీన్నే జియో గిగా ఫైబర్‌గా పిలుస్తున్నట్లు ముఖేశ్ చెప్పారు. జియో గిగా ఫైబ‌ర్ కోసం ఆగ‌స్టు 15 నుంచి ఎన్‌రోల్మెంట్ ఉంటుంద‌ని ముఖేశ్ తెలిపారు. గత ఏడాది ముఖేశ్ కంపెనీ తన ఏజీఎం మీటింగ్‌లో రూ.1500 జియో ఫోన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
mukesh ambani
 
గురువారం జరిగిన వార్షిక సమావేశంలో ఈ గిగా ఫైబర్‌ను ఆవిష్కరించారు. ఆయన షేర్‌హోల్డర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రిలయన్స్ లాభాలు 20.6 శాతం పెరిగినట్లు తెలిపారు. ఆ లాభం రూ.36 వేల 75 కోట్లకు చేరుకుందన్నారు. జీఎస్టీ కింద రిలయన్స్ సంస్థ రూ.42 వేల 553 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 
 
ఫిక్స్‌డ్ బ్రాండ్‌బ్యాండ్‌లో ఇండియా ర్యాంకింగ్ త‌క్కువ‌గా ఉందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీలో కంపెనీ ఇప్పటివరకు 250 మిలియన్ డాలర్లు పెట్టబడి పెట్టినట్లు చెప్పారు. ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను 1100 నగరాలకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఇంటర్నెట్ మరింత వేగంగా వస్తుందన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

భారత్‌‌లో ఎర్రిక్సన్ 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌.. వచ్చే మూడేళ్లలోపు..?

భారత్‌‌లో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌కు రంగం సిద్ధం అవుతోంది. స్పీడన్‌కు చెందిన ...

news

జీబీలు కాదు.. టెర్రాబైట్ల డేటా : రిలయన్స్ జియో బంపర్ ఆఫర్

దేశ టెలికాం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రిలయన్స్ జియో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ...

news

రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. జియో లింక్ పేరుతో.. 90 రోజులు ఉచిత డేటా

దేశ వ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం తన వినియోగదారుల ...

news

అలా చేస్తే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... వారికి మాత్రమే...

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా లభించనుంది. ఇందుకోసం నెటిజన్లు లేదా మొబైల్ ...