సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (12:49 IST)

Nokia C21 Plus..సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Nokia C21 Plus
Nokia C21 Plus
నోకియా నుంచి సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ అయ్యింది. నోకియా సీ21 ప్లస్ (Nokia C21 Plus) మొబైల్‌ భారత్‌లో మంగళవారం విడుదలైంది. నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఈ మొబైల్‌ సేల్‌కు అందుబాటులో ఉంది. డార్క్ సియాన్, గ్రే కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది. 
 
లాంచ్ ఆఫర్‌ కింద ప్రస్తుతం ఈ మొబైల్‌ను కొంటే నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్‌ఫోన్స్ ఉచితంగా పొందవచ్చు. త్వరలోనే ఈ-కామర్స్ సైట్లు, రిటైల్ స్టోర్స్‌లో కూడా నోకియా సీ21 ప్లస్ అమ్మకానికి రానుంది. 
 
5050 mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉండగా.. మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందంటూ నోకియా చెబుతోంది. 
 
ఆండ్రాయిడ్‌ 11 గో (ఆండ్రాయిడ్ 11 Go) ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ వస్తుండగా.. రెండు సంవత్సరాలు అప్‌డేట్‌లు ఇవ్వనున్నట్టు తెలిపింది. వెనుక రెండు కెమెరాల సెటప్‌ను నోకియా సీ21 ప్లస్ కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
 
ఫీచర్స్
నోకియా సీ21 ప్లస్ 3 జీబీ + 32 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.10,299గా ఉంది.
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న టాప్‌ వేరియంట్ ధరను రూ.11,299గా నోకియా నిర్ణయించింది.