ఒప్పో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ‘రెనో’ ఫీచర్లు ఇవే..
చైనీస్ హ్యాండ్‌సెట్ బ్రాండ్ ఒప్పో నుంచి మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రెనో వచ్చేసింది. రెనో సిరీస్‌లో భాగంగా రెండు వేరియంట్‌లను తీసుకొచ్చింది. ఒప్పొ రెనో 10ఎక్స్ జూమ్, ఒప్పో రెనోలను విడుదల చేసింది. ఈ మేరకు ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఎడిషన్ 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర భారత్‌లో రూ.39,990 కాగా, 8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 49,990గా నిర్ణయించబడింది.
ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ చేస్తూండగా... ఒప్పో రెనో 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,990. ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఎడిషన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా జూన్ 7వ తేదీ నుంచి అందుబాటులో రానుండగా, ఒప్పో రెనో రిటైల్ స్టోర్లు, అమెజాన్ ద్వారా అదే రోజు నుంచి అందుబాటులోకి రానుంది.
ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి:
6.6 అంగుళాల పనోర్యామిక్ అమోలెడ్ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ఎస్ఓసీ,
6జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్లు,
48+13+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
బ్యాటరీ 4,065 ఎంఏహెచ్
కాగా... ఒప్పో రెనో స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి:
6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ పనోర్యామిక్ అమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ఎస్ఓసీ,
8 జీబీ ర్యామ్,
48+5 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా,16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,
బ్యాటరీ 3,765 ఎంఏహెచ్.