శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (21:01 IST)

ఓకిటెల్​ WP15 5G స్మార్ట్​ఫోన్.. ధర ఎంతంటే..?

Oukitel WP15 5G
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ ఓకిటెల్ నుంచి ఓకిటెల్​ WP15 5G స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. దీనిలో అతి పెద్ద 15,600 ఎంఏహెచ్​ బ్యాటరీని అందించింది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే స్టాండ్‌బై మోడ్​లో 1,300 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. 
 
అంతేకాదు, ఇది130 గంటల కాలింగ్‌ని కూడా అందిస్తుంది. సాధారణ వినియోగంలో నాలుగు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న స్మార్ట్​ఫోన్లలో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ అందిస్తుండగా.. దీనిలో ఏకంగా 15,600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించడం విశేషం. ఈ ఫోన్ కార్బన్ ఫైబర్ ఆకృతి ఆధారిత డిజైన్‌తో వస్తుంది.
 
ఓకిటెల్​ సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 8జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్ మోడల్ $ 299.99 (సుమారు రూ. 22,200) ధర వద్ద లభిస్తుంది. ఇది సింగిల్ క్లాసిక్ బ్లాక్ కలర్​ ఆప్షన్​లో అందుబాటులో ఉంటుంది. 
 
ప్రముఖ ఈ-కామర్స్ (E Commerce)​ సైట్​ అలీ ఎక్స్​ప్రెస్​ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఓకిటెల్​ WP15 5జీ స్మార్ట్​ఫోన్(Oukitel WP15 5G SmartPhone)​ ఆండ్రాయిడ్​ 11 పై పనిచేస్తుంది. ఇది 6.52 -అంగుళాల HD+ ఇన్‌సెల్ IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. 
 
దీనిలో 8 జీబీ ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించింది. హైబ్రిడ్ మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ సహాయంతో 256 జీబీ వరకు స్టోరేజ్​ను విస్తరించుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే, ఓకిటెల్​ WP15 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 48 -మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరా, 2 -మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, 0.3 -మెగాపిక్సెల్ బొకే లెన్స్‌ కెమెరాలను చేర్చింది.