పోకో నుంచి సీ3 స్మార్ట్ ఫోన్.. ధర రూ. రూ.7,499

Poco C3
సెల్వి| Last Updated: మంగళవారం, 6 అక్టోబరు 2020 (18:50 IST)
Poco C3
ప్రముఖ చైనీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి సబ్ బ్రాండ్ పోకో తన కొత్త పోకో సీ3 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్‌లో రెండు మెమరీ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 10W ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు.

ఈ ఫోనులో 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్ బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 3 జీబీ ర్యామ్+32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్+64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ లైమ్ గ్రీన్, ఆర్కిటిక్ బ్లూ, మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానుంది. అక్టోబర్ 16 నుంచి ఈ ఫోన్ సేల్ కానుంది.

పోకో సీ 3 ఫీచర్ల సంగతికి వస్తే?
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్,
6.53 అంగుళాల హెచ్ డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే,
5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
13+2+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టందీనిపై మరింత చదవండి :