శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (15:02 IST)

#realmeSmartTV4K రియల్‌మీ నుంచి స్మార్ట్‌టీవీ.. ధర రూ.27,999

Realme Smart TV 4K
రియల్‌మీ నుంచి స్మార్ట్‌టీవీ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇంకా 43 అంగుళాలు, 50 అంగుళాల సైజుల్లో 4కే టీవీలను ఆవిష్కరించింది. హెచ్‌డీఆర్‌ సపోర్ట్‌, డాల్బీ విజన్‌ టెక్నాలజీ, డాల్బీ అట్మోస్‌ ఆడియో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
 
రెండు టీవీలు ఆండ్రాయిడ్‌ 10 టీవీ ఆధారంగా పనిచేయనున్నాయి. క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ టీవీల్లో 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌తో వస్తున్నది. ఆల్‌ఇన్‌ వన్‌ స్మార్ట్‌ రిమోట్‌తో పాటు గూగుల్‌ అసిస్టెంట్‌ బ్లూటూత్ 5.0, వైఫై 2.4 Ghz, 5Ghz లను ఇది సపోర్ట్‌ చేస్తుంది.
 
స్మార్ట్‌టీవీని జూన్‌ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీడాట్‌కామ్‌లతో పాటు రిటైల్‌ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. రియల్‌మీ స్మార్ట్‌టీవీ 4కే 43 అంగుళాల వేరియంట్‌ ధర రూ.27,999 కాగా, 50 అంగుళాల వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది.