ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (09:39 IST)

రిలయన్స్ జియో- రూ.601తో అప్ గ్రేడ్ వోచర్‌ వచ్చేసింది..

Jio
Jio
రిలయన్స్ జియో నుంచి సూపర్ ప్లాన్ వస్తోంది. అపరిమిత 5జీ డేటా సేవలకు గానూ రూ.601తో అప్ గ్రేడ్ వోచర్‌ను తీసుకువచ్చింది. 4జీ వినియోగదారులు సైతం ఈ వోచర్ సాయంతో 5జీ సేవలను పొందవచ్చు. 
 
జియో 5జీ సేవలు తీసుకొచ్చినప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్, నెట్‌వర్క్ ఉన్న వారందరికీ వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత 5జీ డేటాను అందించింది. రూ.239 కంటే ఎక్కువ రీచార్జి చేసిన వారందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది. 
 
అయితే, తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వారికీ 5జీ సేవలు అందించేందుకు ఆ మధ్య సంస్థ రూ.51, రూ.101, 151తో బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
 
తాజాగా ఏడాది పొడవునా అపరిమిత 5జీ డేటాను అందించేందుకు రూ.601 వోచర్‌ను జియో తీసుకువచ్చింది. దీన్ని జియో యాప్‌లో కొనుగోలు చేసి యాప్‌లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు.