శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 జులై 2017 (10:29 IST)

4జీ టెక్నాలజీతో పనిచేసే.. ఫీచర్ ఫోన్ రూ.500లకే.. ఎవరిస్తున్నారు..?

టెలికం మార్కెట్లో మరో సంచనలనానికి రిలయన్స్ జియో రెడీ అయింది. అతి త్వరలో అత్యంత చౌక ధరలో ఫీచర్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఇందులో భాగంగా రూ.500లకే ఫీచర్ ఫోనును ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 4

టెలికం మార్కెట్లో మరో సంచనలనానికి రిలయన్స్ జియో రెడీ అయింది. అతి త్వరలో అత్యంత చౌక ధరలో ఫీచర్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఇందులో భాగంగా రూ.500లకే ఫీచర్ ఫోనును ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 4జీ సేవలను ప్రారంభించి, ఉచిత వాయిస్, డేటా సేవలంటూ టెలికాం సంస్థల కంపెనీలకు కునుకు లేకుండా చేసిన రిలయన్స్ జియో.. 4జీ తరంగాల సాయంతో పనిచేసే ఫీచర్ ఫోన్ ను రూ. 500కే ఇవ్వాలని నిర్ణయించింది. 
 
గతంలో ఈ ఫోన్ ధర రూ.1500 వరకు ఉంటుందని అందరూ భావించారు. కానీ దిగువ తరగతి మార్కెట్‌పై కన్నేసిన ముఖేష్ అంబానీ, రూ. 500కే ఫీచర్ ఫోనును అందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ బ్రోకరేజ్, ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని సమాచారం. అంతేగాకుండా ఈ నెలతో ముగియనున్న ధనా ధనా ధన్ ఆఫర్ స్థానంలో మరో ఆకర్షణీయ టారిఫ్ ప్లాన్‌ గురించి ముఖేష్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు కె9 కవచ్ 4జీ పేరిట కార్బన్ మొబైల్స్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.5,290 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. 
కార్బన్ కె9 కవచ్ 4జీ ఫీచర్ల సంగతికి వస్తే.. 
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 
1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్,
32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 
5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ కలిగివుంటుంది.