బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (20:40 IST)

జియో యూజర్లకు గుడ్‌న్యూస్...

తమ యూజర్లకు రిలయన్స్ జియో ఓ శుభవార్త తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొడగించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

తమ యూజర్లకు రిలయన్స్ జియో ఓ శుభవార్త తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొడగించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 
 
వాస్తవానికి ఈ ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈనెల 25వ తేదీతో ముగిసింది. అయితే ఈ ఆఫర్‌ను డిసెంబర్ 15వ, తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రైమ్‌ యూజర్లు జియో ఓచర్లు, వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌, ఆన్‌లైన్‌ ట్రావెల్‌, షాపింగ్‌ డిస్కౌంట్లను వచ్చే నెల మధ్య వరకు ఆఫర్‌ చేయనుంది. రూ.399 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్‌ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. 
 
అయితే రూ.50 విలువైన రీఛార్జీ వోచర్లు 8 అందించనుంది. తర్వాత రీఛార్జ్‌ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. జియో ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద మైజియో, జియో.కామ్‌ సైటు ద్వారా రీఛార్జ్‌ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు ఈ మొత్తాన్ని ఆఫర్‌ చేస్తోంది.