శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (14:55 IST)

మీ నెంబరును జియోకు మార్చాలా? అబ్బే కుదర్దు... ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్లపై Jio ఫైర్

రిలయన్స్ Jio 4జి వచ్చిన దగ్గర్నుంచి ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ ప్రకటించడమే. ఐతే రిల

రిలయన్స్ Jio 4జి వచ్చిన దగ్గర్నుంచి ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ ప్రకటించడమే. ఐతే రిలయన్స్ జియో సిమ్ తీసుకున్నవారు చేస్తున్న ఫిర్యాదులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.



అందులో మొదటిది జియో నుంచి ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్ తదితరటెలికం కంపెనీల వినియోగదారులకు కాల్స్ వెళ్లడం లేదన్న ఫిర్యాదు. ఇంటర్ కనెక్ట్ కెపాసిటీ తమకు లేదని వివిధఛ టెలికం సంస్థలు వెల్లడించడంపై ముఖేష్ అంబాని మండిపడ్డారు. సమస్య తాత్కాలికమైతే ఫర్వాలేదు కానీ దీర్ఘకాలంగా అలాగే సాగితే మాత్రం అది చట్టవ్యతిరేకం అవుతుందన్నారు. 
 
మరోవైపు కొత్తగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీకి కూడా ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా అంగీకరించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అభ్యర్థనలన్నిటినీ పక్కనపడేశారంటూ వినియోగదారులు మండిపడుతున్నారు. దీనిపై జియో కూడా అసహనం వ్యక్తం చేసింది. వినియోగదారులు అడిగినప్పుడు చట్ట ప్రకారం మార్చాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ మూడు సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం తొక్కిపడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ట్రాయ్ జోక్యం చేసుకోవాలని జియో కోరుతోంది. అంతేకాదు... జియో సిమ్ వాడుతున్నవారి ఫోన్లకు ఇతర నెంబర్లు కనెక్టివిటీ ఉండటం లేదనీ, అలాగే వైఫై కూడా లేకుండా చేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై రిలయన్స్ జియో ఆయా కంపెనీలకు వివరణ అడుగుతోంది. ఐతే ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలు మాత్రం అలాంటి సమస్యలేమీ లేవని చెపుతున్నాయి.