శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (06:49 IST)

కష్టమర్లకు జియో షాక్.. రోజుకు 5 గంటలు మాత్రమే ఫ్రీకాల్స్

రిలయన్స్ జియో తన కష్టమర్లకు తేరుకోలేని షాకిచ్చింది. ఇపుడు ఇస్తున్న అపరిమత ఉచిత కాల్స్‌పై ఆంక్షలు విధించనుంది. ఇకపై రోజుకు కేవలం 300 నిమిషాలు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునేలా నిబంధన విధించబోతున్నట్టు రిప

రిలయన్స్ జియో తన కష్టమర్లకు తేరుకోలేని షాకిచ్చింది. ఇపుడు ఇస్తున్న అపరిమత ఉచిత కాల్స్‌పై ఆంక్షలు విధించనుంది. ఇకపై రోజుకు కేవలం 300 నిమిషాలు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునేలా నిబంధన విధించబోతున్నట్టు రిపోర్టులు తెలిపాయి.
 
దీనిపై జియో ప్రతినిధులు స్పందిస్తూ.. అపరిమిత కాల్స్ ఫీచర్‌తో కొంతమంది వినియోగదారులు రోజుకు 10 గంటలకు పైగా మాట్లాడుతూ, సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తుండటమే దీనికి కారణం. వాయిస్ కాల్స్ ఫీచర్ పక్కదారి పడుతోందని జియో గుర్తించినట్టు టెలికాంటాక్ట్ జియో ప్రియారిటీ టీమ్ తెలిపింది. 4జీ డేటా మాదిరిగానే వాయిస్ కాల్స్‌పై కూడా పరిమితి తెస్తున్నట్టు వెల్లడించింది.
 
2016 సెప్టెంబర్‌లో జియో లాంచ్ అయినప్పుడు 4జీ డేటాను కూడా అపరిమితంగానే ఆఫర్ చేసింది. అయితే డేటా వాడకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించిన జియో... ఆ తర్వాత డేటా వాడకంపై పరిమితులను విధించింది. ప్రస్తుతం రోజుకు ఒక జీబీ డేటాను అందిస్తోంది. 1జీబీ డేటా తర్వాత డేటా స్పీడు పడిపోయింది. ఇదే రీతిలో ఇప్పుడు వాయిస్ కాల్స్‌పై కూడా పరిమితులు విధించేందుకు జియో రంగం సిద్ధం చేస్తోంది. 

అలాగే, రిలయన్స్ జియో రూ.149 ప్లాన్‌లో కీలక మార్పు చేసింది. ఇప్పటి‌వరకూ 2జీబీ, 4జీ డేటాతో పాటు 300 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయం ఉండేది. 2జీ డేటా పరిమితిదాటితే ఇంటర్‌నెట్ వాడుకునే అవకాశం లేదు. దీంతో వినియోగదారుడు మళ్లీ బూస్టర్ ప్యాక్స్ తీసుకోవాల్సిందే. 
 
అయితే ఇప్పుడు ఈ పరిస్థితి లేకుండా 2జీబీ పరిమితి దాటిన తర్వాత కూడా ఇంటర్నెట్ వాడుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా 64 కేబీపీఎస్ వేగంతో వాడుకునేలా వెసులుబాటు కల్పించింది. దీంతో తక్కువ డేటా ఉపయోగించే వారికి ఈ మార్పు శుభవార్తే.