బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (12:19 IST)

జియో 4G డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగంలో జియో టాప్

jioservice
ఉచిత డేటా సంచలనం సృష్టించిన జియో 4G డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగంలో నెంబర్ వన్‌గా నిలిచింది. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడి అయ్యింది. ప్రస్తుతం 5జీ సేవలను అందించేందుకు సర్వం సిద్ధం చేసుకున్న జియో డౌన్ లోడ్, అప్ లోడ్ వేగంలో అదరగొట్టింది.
 
ట్రాయ్ నివేదిక ప్రకారం.. జియో సగటు 4G డౌన్‌లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 ఎంబీపీఎస్ నుండి అక్టోబర్‌లో 20.3 ఎంబీపీఎస్‌కి పెరిగింది. సగటు డౌన్‌లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ మధ్య గట్టి పోరు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సగటు 4G అప్‌లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది.