గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (09:28 IST)

జియో అదుర్స్... రెవెన్యూలోనూ అదరగొట్టింది..

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ.. రెవెన్యూలోనూ అగ్రస్థానంలో నిలిచింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికాం రంగంలోని సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) విషయంలో రూ.8.271 కోట్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచిందని ట్రాయ్ వెల్లడించింది.
 
ట్రాయ్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. వొడాఫోన్-ఐడియా రూ. 7,528 కోట్ల రాబడితో రెండో స్థానంలో వుండగా.. ఇందులో వొడాఫోన్ ఏజీఆర్ రూ.4,483 కోట్లు రాగా, ఐడియా రూ.3,743.1 కోట్లను రాబట్టింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.6,720 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. 
 
అలాగే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం స్సత బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా రూ.1,284 కోట్లుగా తేలింది. గత త్రైమాసికంలో జియో ఏజీఆర్ విలువ రూ.7,125.5 కోట్లు కాగా.. వొడాఫోన్ ఐడియా కలిసినప్పుడు ఏజీఆర్‌ల విలువ రూ.8.226.79 కోట్లు కావడం గమనార్హం.