Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విద్యార్థులకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్... ఉచిత వైఫై

సోమవారం, 24 జులై 2017 (12:15 IST)

Widgets Magazine
free WiFi

భార‌త‌దేశంలో టెలికాం రంగంలో రిల‌య‌న్స్ జియో తీసుకొచ్చిన విప్ల‌వం అంతాఇంతా కాదు. ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికీ స్మార్ట్ సేవ‌లు అందుతున్నాయంటే అది జియో పుణ్య‌మేనని చెప్పొచ్చు. అలాగే, త్వరలోనే దేశంలోని ప్రతి ఒక్కరికీ 4జీ ఫీచ‌ర్ ఫోన్ ఉచితంగా అంద‌జేసి మ‌రో విప్లవానికి జియో నాందిపలికింది. 
 
ఈవిప్ల‌వంలో భాగంగానే త్వ‌ర‌లో దేశంలో ఉన్న 3 కోట్ల మంది క‌ళాశాల విద్యార్థుల‌కు ఫ్రీ వై-ఫై సేవ‌లు అంద‌జేసే యోచ‌న‌లో రిల‌య‌న్స్ జియో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంపై ప్ర‌భుత్వ అనుమ‌తి కోరుతూ మాన‌వవ‌న‌రుల శాఖ‌కు రిల‌య‌న్స్ కంపెనీ ప్రతినిధులు ఓ దరఖాస్తు సమర్పించినట్టు స‌మాచారం. 
 
ఇందులోభాగంగా వై-ఫై క‌నెక్టివిటీ ద్వారా 38,000 క‌ళాశాల‌ల‌ను అనుసంధానించ‌నున్నారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల మాన‌వవ‌నరుల శాఖ‌కు ఎలాంటి వ్య‌యం లేకున్నా మిగ‌తా టెలికాం ఆప‌రేటర్ల ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ టెండ‌ర్‌పై పార‌ద‌ర్శ‌కంగా నిర్ణయం తీసుకోనున్న‌ట్లు తెలిసింది. 
 
దీనిపై హెచ్‌ఆర్డీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వైఫై సేవలు ఉచితంగా అందిస్తామని రిలయన్స్‌ జియో చెప్తుండటంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా జియోకే పట్టం కట్టడం సరికాదు కాబట్టి టెండర్‌ ప్రాసెస్‌ను అమలు చేస్తామన్నారు. అయితే, ఉచితంగా సర్వీసులు జియో ఇస్తుంది కాబట్టి టెంబర్‌ దానికే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియో ఫీచర్ ఫోన్.. వాడే చిప్ సెట్ లీక్... డిజిటల్ పేమెంట్‌ ఇక ఈజీ..

ఉచిత డేటా పేరిట దేశంలో సంచలనం సృష్టించిన జియో.. తాజాగా ఫీచర్ ఫోన్లను వినియోగదారులకు ...

news

జియో 4జీ ఫోన్‌‍ను ఎలా బుక్ చేసుకోవాలంటే...

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో ఉచితంగా 4జి ఫీచర్ ఫోన్‌ను అందజేయనున్నట్టు ...

news

జియో ఫ్రీ ఫోన్‌పై పెదవి విరుస్తున్న టెక్ నిపుణులు...

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెల్సిందే. దేశంలోని ప్రతి ...

news

'జియో' జింతాత్త జితా జితా... ఇక ఇండియాలో ఆ ఫోన్లు తప్ప ఏ ఫోన్లు కొనేవాళ్లుండరా...?

రూ.0 కే జియో స్మార్ట్ ఫోన్. ఇక ఈ ఫోను మార్కెట్లోకి వస్తే మిగిలిన కంపెనీల ఫోన్లు ...

Widgets Magazine