సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 17 నవంబరు 2020 (19:12 IST)

లోన్లు ఇస్తామని ఆకర్షిస్తున్నా ఆ నాలుగు యాప్‌లు తొలగింపు: గూగుల్

ఆన్లైన్లో రుణాలు అందించే నాలుగు యాప్‌లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అధిక వడ్డీపై స్వల్పకాలిక రుణాలను అందజేస్తున్న ఈ నాలుగు యాప్‌లపై నిఘా ఉంచింది. ఈ యాప్‌ల కార్యకలాపాలు తమ పాలసీకి విరుద్దంగా ఉన్నాయని గూగుల్ తెలిపింది.
 
గూగుల్ నిర్ణయం అనంతరం ప్లేస్టోర్ నుంచి ఓకే క్యాష్, గో క్యాష్, ప్లిప్ క్యాష్, స్నాప్ ఇట్ లోన్ అనే నాలుగు యాప్‌లను శాశ్వతంగా తొలగించాయి. దీనిపై గూగుల్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ గూగూల్ ప్లే డెవలెపర్ పాలసీలు, యూజర్ల భద్రతకు పెద్దపీట వేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
 
ఇటీవల తాము ఆర్థిక వ్యవహారాలకు చెందిన పాలసీలను విస్తరణ చేశామని, తద్వారా తమ యూజర్లు మోసపూరిత అంశాలకు దూరమవుతారని తెలిపింది. ఈ యాప్‌లు తమ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. గూగుల్ ఆగ్రహానికి గురైన ఈ నాలుగు యాప్‌లకు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు చట్టబద్దత లేదని తెలుస్తోంది.