శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (12:23 IST)

శాంసంగ్ నుంచి 5జీ వేరియంట్ ఫోన్.. కరోనా పోయాక లాంఛ్ చేస్తారట..

శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లోకి ఆవిష్కరించనుంది. శాంసంగ్ తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ71కు 5జీ వేరియంట్‌ను ముందుగా చైనాలో లాంచ్ చేసి తరువాత ఇతర దేశాలలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. గెలాక్సీ ఏ71 పాత వెర్షన్లో ఉన్న ఫీచర్లనే ఇందులోనూ అందిస్తున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. 
 
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఈ ఫోన్‌లో ఉండనుందంటున్నారు. 980 ప్రాసెసర్‌ను కూడా అందించే అవకాశం కూడా ఉంది. ఇక 4370 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఈ ఫోన్ కలిగివుంది. 
 
బ్లూ, బ్లాక్, తెలుపు రంగుల్లో ఈ ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఫోన్ ధర రూ.37వేలు వుంటుందని అంచనా. ప్రస్తుతం కరోనా వైరస్ కథ ముగిసిన తరువాతే ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.