శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (12:44 IST)

టీవీలు, స్మార్ట్ ఫోన్‌ ధరల పెంపు: షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే..?

కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒకవేళ షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుండటంతో స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు.
 
ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను సరఫరా చేసే నగరాల్లో షెన్‌జెన్ ఒకటి. అక్కడి నుంచే 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు భారత్‌కు దిగుమతి అవుతుంటాయి.
 
షెన్‌జెన్‌లో కరోనా కేసులు మరికొన్నిరోజులు ఇలాగే కొనసాగితే అధికారులు లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ లాక్ డౌన్ మూడు వారాలు దాటితే మన దేశంలోకి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై ప్రభావం పడుతుందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ రీసెర్చ్ డైరెక్టర్ నవ్‌కేంద్రసింగ్ వెల్లడించారు.