శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 మే 2017 (11:36 IST)

''స్టోర్ డాట్'' నుంచి ఫ్లాష్ బ్యాటరీలు.. ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్!

స్మార్ట్ ఫోన్ల వాడకం ప్రస్తుతం ఎక్కువైపోయింది. తాజాగా ఇజ్రాయేల్ స్టార్టప్ ''స్టోర్ డాట్'' కంపెనీ ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యే ఫ్లాష్ బ్యాటరీలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. లాస్ వెగ

స్మార్ట్ ఫోన్ల వాడకం ప్రస్తుతం ఎక్కువైపోయింది. తాజాగా ఇజ్రాయేల్ స్టార్టప్ ''స్టోర్ డాట్'' కంపెనీ ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యే ఫ్లాష్ బ్యాటరీలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. లాస్ వెగాస్‌లోని జరిగిన సీఈఎస్ టెక్ షోలో ఫ్లాష్ బ్యాటరీలను ప్రదర్శించింది. అత్యంత వేగంగా బ్యాటరీని ఛార్జింగ్ చేయగల టెక్నాలజీని 2015లోనే స్టోర్ డాట్ ప్రకటన చేసింది. 
 
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ బ్యాటరీలను వినియోగదారులకు వీలుగా అందుబాటులోకి తేనున్నట్లు స్టోర్ డాట్ సీఈవో డొరొన్ మియర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ బ్యాటరీలను మార్కెట్లోకి తీసుకొచ్చే పనులు పూర్తయినట్లు వెల్లడించారు. 
 
యానోడ్‌ నుంచి కాథోడ్‌కు అయాన్లను పంపించే ఎలక్ట్రిక్‌ ప్రక్రియను వేగవంతం చేసే పదార్థాలను ఈ బ్యాటరీలలో పొందుపరిచారు. అతి సూక్ష్మమైన నానో మెటీరియల్స్‌, ఆర్గానిక్ కాంపౌడ్స్‌ వినియోగించి వీటిని తయారు చేసినట్లు డొరొన్ చెప్పుకొచ్చారు.