టిక్ టాక్ లవర్స్‌కి తీపి కబురు.. ఆ చర్చలు సఫలమైతే.. ఇంకేముంది?
చైనాతో సరిహద్దుల ఉద్రిక్తత నేపథ్యంలో.. టిక్ టాక్‌తో పాటు చైనా యాప్‌లపై నిషేధం విధించింది భారత సర్కారు. దీంతో టిక్ టాక్ యూజర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్న సమయంలో టిక్ టాక్ లవర్స్‌కి తీపికబురు అందింది. టిక్ టాక్ మళ్లీ భారత్‌లో అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
ఎలాగంటే? టిక్ టాక్ చైనా కంపెనీ కావడంతో ఇండియన్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. ప్రస్తుతం టిక్ టాక్‌ను జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా వుంది. టిక్ టాక్‌ను కొనుగోలు చేయడానికి సాఫ్ట్ బ్యాంక్ ప్రస్తుతం భారతీయ భాగస్వామి కోసం తీవ్రంగా వెతుకులాటను ప్రారంభించిందని విశ్వాసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే సాఫ్ట్ బ్యాంక్ టిక్ టాక్ కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి కంపెనీలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే టిక్ టాక్ యూజర్లు మళ్లీ టిక్ టాక్‌లో వీడియోలు చేసుకునే ఛాన్స్ రావొచ్చు. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్ టిక్ టాక్ యాప్ నిషేధంతో భారీగా నష్టపోయింది. దాదాపు 6 బిలియన్ డాలర్లు నష్టపోయి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.