శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (13:04 IST)

ఎంబీఏ చేశారా? టీసీఎస్ నుంచి అదిరిపోయే ఆఫర్

ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్) ఇటీవల కాలంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఫ్రెషర్స్‌ని ఎక్కువగా నియమించుకుంటోంది. అందుకోసం వేర్వేరు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. 
 
ఇప్పటికే ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022, స్మార్ట్ హైరింగ్ 2022, ఎంబీఏ హైరింగ్ 2022 లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా నియామకాలు చేపట్టింది. ఇప్పుడు మరోసారి టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ 2022 ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. 
 
ఎంబీఏ చదువుతున్నవారితో పాటు ఎంబీఏ పాసైనవారు అప్లై చేయొచ్చు. గతంలో ఈ ప్రోగ్రామ్‌కు చివరి తేదీ ఉండేది. కానీ ప్రస్తుతం ప్రకటించిన టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ 2022 ప్రోగ్రామ్‌కు చివరి తేదీ లేదు. అయితే దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.
 
టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్ గతేడాది ప్రారంభమైంది. విడతలవారీగా టీసీఎస్ దరఖాస్తుల్ని స్వీకరించింది. 2021 నవంబర్ 21 నుంచి టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ టెస్ట్స్ జరుగుతున్నాయి. ఈ టెస్టులు బ్యాచ్‌ల వారీగా కొనసాగుతున్నాయి.