శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (13:29 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 40వేల మందికి..?

టీసీఎస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశంలో 40వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. అయితే ఈ నియామకాలు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉంటాయని తెలిపింది. కరోనా వలన గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం తగ్గినప్పటికీ తమ సంస్థ మాత్రం నియామకాలను తగ్గించుకోదని టీసీఎస్‌ ప్రతినిధులు తేల్చేశారు.
 
అమెరికాలో కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ పెంచాలనుకుంటున్నామని వెల్లడించారు. అయితే 2014 నుంచి టీసీఎస్ 20వేల మందికి పైగా అమెరికన్లను నియమించుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ టిసిఎస్ కంపెనీ గత సంవత్సరం కూడా మన భారత క్యాంపస్‌ల నుంచి 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది.
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 2,000 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. దీని వలన హెచ్1బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చునని టీసీఎస్ వెల్లడించింది. ఇంజనీర్లను మాత్రమే కాకుండా అమెరికాలో టాప్-1 బి-స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది.