Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చేతులు కలిపిన టిమ్ - జుకెర్‌బర్గ్ - సుందర్ పిచాయ్, ట్రంప్‌కు మడతడిపోద్దా...?

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:47 IST)

Widgets Magazine
donald trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఏకమయ్యాయి. ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటించిన ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై వీసా నిషేధాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్ సహా కార్పొరేట్ కంపెనీలన్నీ ఏకమయ్యాయి. ఈ కార్పొరేట్ దిగ్గజాలన్నీ కలిసి ట్రంప్‌కు లేఖ రాయనున్నాయి. 
 
ఓ వివాదాస్పద నిర్ణయంపై ఇలా పెద్ద కంపెనీలన్నీ కలిసికట్టుగా ముందుకు రావడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం. వీసా నిషేధంపై గత వారం రోజులుగా అమెరికన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న విషయం తెల్సిందే. వలస కుటుంబాలు నెలకొల్పిన కంపెనీలతో నిండిపోయిన సిలికాన్‌ వ్యాలీలో నిరసనల తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. 
 
సర్జీ బ్రిన్, టిమ్ కుక్, మార్క్ జుకెర్‌బర్గ్ సహా పలు కార్పొరేట్ అధినేతలు ట్రంప్ నిర్ణయాన్ని బహిరంగంగానే తూర్పారబడుతున్నారు. దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలూ అధ్యక్షుడి నిర్ణయంపై మండిపడ్డాయి. ఇప్పటికే ట్విట్టర్, ఎయిర్ బీఎన్‌బీ వంటి కంపెనీలు శరణార్థులకు అండగా ఉంటామని ప్రకటించాయి. 
 
ఈ పరిస్థితుల్లో టిమ్ కుక్, మార్క్ జుకెర్‌బర్గ్, సుందర్ పిచాయ్‌లు ఏకం కావడం గమనార్హం. ‘‘వలసలు లేకుండా ఆపిల్ కంపెనీనే లేదు. ట్రంప్ వలస విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై కలిసికట్టుగా గొంతు వినిపించాలి. సరికొత్త పంథాతో ముందుకెళ్లాలి’’ అంటూ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. 
 
అలాగే, ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ స్పందిస్తూ.. ‘‘ట్రంప్ నిర్ణయం మీలో చాలామందిలాగే నేనూ ఆందోళన చెందుతున్నాను. శరణార్థుల కోసం ఎవరు ఎలాంటి సహాయం కోరినా చేసేందుకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’’ అని బాహాటంగా ప్రకటించారు.
 
ఇక టెక్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సీఈవో సుందర్ పీచాయ్ మాట్లాడుతూ... ‘‘ఈ ఆదేశాల వల్ల కలిగే ప్రభావంతో పాటు గూగుల్ అభిమానులు, వారి కుటుంబాలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికాకు గొప్ప నైపుణ్యాన్ని తీసుకువచ్చేందుకు ఇలాంటి నిర్ణయాలు అడ్డంకులు సృష్టిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

కేవైవీ 40 స్మార్ట్ ఫోన్‌‌ను వేడి నీటితో సబ్బేసి వాష్ చేయొచ్చు.. షాక్ ఫ్రూప్ టెక్నాలజీతో?

స్మార్ట్ ఫోన్‌ నీటిలో పడిందో అంతే సంగతులు. అయితే క్యోసెరా సంస్థకు చెందిన రాఫ్రె కేవైవీ 40 ...

news

రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్‌కు ఎసరు పెడుతున్న వోడాఫోన్... ఎలా?

దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత తీవ్రమైన పోటీ నెలకొంది. ...

news

రిలయన్స్ జియోపై వొడాఫోన్ కేసు.. ట్రాయ్ వంతపాడిందా.. ఫ్రీ ఆఫర్ వెనక్కి?

రిలయన్స్ జియోకు వొడాఫోన్‌తో కష్టాలు తప్పేలా లేవు. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్స్‌ను తుంగలో తొక్కి ...

news

బ్లాక్‌బెర్రీ నుంచి బీబీసీ 100-1 స్మార్ట్ ఫోన్.. 25న మార్కెట్లోకి..

బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'బీబీసీ100-1'ను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ ...

Widgets Magazine